Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అనుముల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది.
Revanth Reddy Telangana CM or Not
రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపించడమే కాకుండా అందరినీ ఒకే తాటి పైకి తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించినట్లు అభిప్రాయ పడింది. ఇప్పటికే సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిని(Revanth Reddy) ఎన్నికైన అభ్యర్థులు ఏకగ్రీవంగా అత్యధికంగా తమ నేతగా ఎన్నుకున్నారు.
ఇదే విషయాన్ని ఏక వాక్య తీర్మానం చేసి హై కమాండ్ కు నివేదించారు పార్టీ పరిశీలకులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. చివరి దాకా సీఎం రేసులో నిలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజ నరసింహ.
న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ , డీకేతో పాటు మాణిక్ రావు ఠాక్రే హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అని వెల్లడించారు.
Also Read : Javaria Khanam : పాక్ యువతికి భారత్ వీసా
