Revanth Reddy KCR : ‘దొర’కు ఝలక్ ఇచ్చిన ‘రెడ్డి’
కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ షాక్
Revanth Reddy KCR : హైదరాబాద్ – రేటెంత రెడ్డి , బ్లాక్ మెయిలర్ అంటూ తనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను అనుకున్నట్టుగానే సీఎంగా కొలువు తీరనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కీలక భేటీ ముగిసింది. ఆయన వైపే మొగ్గు చూపింది.
Revanth Reddy KCR Issues
ఓ చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన వారు. వనపర్తిలో చదువుకున్నారు. అక్కడి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కోడంగల్ రేవంత్ రెడ్డిని అక్కున చేర్చుకుంది. గులాబీ చేతిలో ఓటమి పాలైనా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించారు.
తొలుత ఇండిపెండెంట్, ఆ తర్వాత తెలుగుదేశంలో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక రకంగా నిద్ర లేకుండా చేశాడు. అడుగడుగునా ప్రజా సమస్యలను ఎత్తి చూపారు.
తాను ప్రజల సమక్షంలో, మీడియాతో కూడా సంచలన ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. ఎలాగైనా సరే సీఎం అవుతానని కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని , చర్లపల్లి జైలులో ఉంచుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ వచ్చింది. ఆయన సీఎం కాబోతున్నారు.
Also Read : Revanth Reddy Sonia : గాంధీ కుటుంబం రేవంత్ వైపే
