Revanth Reddy : రుణాలు తెచ్చుకోండి మాఫీ చేస్తా
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులకు తీపి కబురు చెబుతున్నానని అన్నారు. మీరంతా ఇప్పుడే వెళ్లి 2 లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి అని, డిసెంబర్ 9న రాగానే ఆ తీసుకున్న రుణాలను నేను మాఫీ చేస్తానంటూ ప్రకటించారు.
Revanth Reddy Promisses
ఆయన బుధవారం గాంధీ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీంతో రైతులంతా బ్యాంకుల వద్దకు వెళ్లడం ప్రారంభించారు. ఇప్పటికే అధికార పార్టీ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారు.
కానీ కొత్తగా రైతులను ఉసి గొల్పడం తప్ప మరొకటి కాదని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. బ్యాంకులు ఉన్నది తమ కాళ్ల మీద నిలబడేందుకు దోహదం చేస్తాయి తప్పా ఉన్న డబ్బులను దుబారా చేయమని చెప్పవు.
బాధ్యత కలిగిన నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల బ్యాంకులు లూటీ అవుతాయే తప్పా బాగు పడవని ఆర్థిక వేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఓటు బ్యాంకు రాజకీయాలకు నేతలు తెర లేపారు. కానీ ఆశించిన మేర ఉద్యోగాల కల్పన ఊసే లేకుండా పోవడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు.
Also Read : Tesla Smart Phone : త్వరలో టెస్లా స్మార్ట్ ఫోన్