Revanth Reddy : కాళేశ్వరం కాదది స్కామేశ్వరం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజ్- టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదని అది స్కామేశ్వరం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మేడిగడ్డ బ్యారేజ్ ను ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి పరిశీలించారు. నిన్న మేడిగడ్డ పిల్లర్స్ కుంగి పోతే ఇవాళ అన్నారం కొనసాగుతోందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Comments on Medigadda Barrage
అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదని, నాలుగున్నర కోట్ల ప్రజల జీవితాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఈ ప్రాజెక్టు ఏటీఎం లాగా మారి పోయిందంటూ మండిపడ్డారు. ఫామ్ హౌస్ పై ఉన్నంత శ్రద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ద పెట్టడం లేదంటూ ఫైర్ అయ్యారు.
లక్ష కోట్లను కొల్లగొట్టి ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నావంటూ ఆరోపించారు. వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కళ్ల ముందే కొట్టుకు పోతుంటే నిమ్మకుండి పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
అవినీతి, అక్రమాలకు కల్వకుంట్ల కుటుంబం కేరాఫ్ గా మారి పోయిందన్నారు. తాము పవర్ లోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే జైలుపాలు చేస్తామని, సంపాదించిన వాటిని కక్కిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్