Revanth Reddy Rahul : రాహుల్..ప్రియాంకకు వెల్ కమ్
ఆహ్వానం పలికిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి నూతన సీఎంగా నియమితులైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 7న గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా పార్టీకి సంబంధించిన పెద్దలను కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్న కొందరిని కలుసుకోగా బుధవారం మరికొందరితో భేటీ అయ్యారు.
Revanth Reddy Invites
మొదట నేరుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వద్దకు వెళ్లారు. ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం ఇచ్చి రావాలని ఆహ్వానించారు. అక్కడి నుంచి సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలుసుకున్నారు. తనకు సీఎంగా పని చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ లను కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారికి పుష్ప గుచ్ఛం ఇచ్చారు. తాను సీఎం అయ్యేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో అన్నీ తామై వ్యవహరించారు అన్నా , చెల్లెలు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత పవర్ లోకి వచ్చింది.
Also Read : Revanth Reddy : సోనియమ్మకు రేవంత్ ఆహ్వానం
