Revanth Reddy :టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ సవాల్ చేశారని తాను అందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు.
ఇదిలా ఉండగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు చేస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు కేటీఆర్.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తోపు కాదన్నారు. తెలంగాణలో కంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు ఉన్నాయని చెప్పారు.
రూ. 2, 500 మద్ధతు ధరతో అక్కడ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని అన్నారు. వరి వేస్తే ఉరే అని టీఆర్ఎస్ సర్కార్ అంటోందని ఇందుకు చర్చకు కేటీఆర్ సిద్దమా అని సవాల్ విసిరారు.
తను ఓకే అంటే మంత్రి కేటీఆర్ ను తాను ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి తీసుకు వెళతానని మరి చర్చకు సిద్దమా అన్నారు. ఇందుకు సంబంధించి మంత్రికి 30 రోజుల పాటు సమయం ఇస్తున్నానని చెప్పారు.
అంత లోపు దమ్ముంటే చర్చకు రావాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉందన్నారు.
ఈ బడ్జెట్ కేసీఆర్ కు ఇదే చివరిదని పేర్కొన్నారు. వచ్చే డిసెంబర్ లో రాష్ట్రంలో ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వ నాశనం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : సర్కార్ వ్యవహారం గవర్నర్ ఆగ్రహం