Revanth Reddy Review : దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి
ఎంసీఆర్హెచ్ఆర్డీఐ పై సమీక్ష
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హల్ చల్ చేస్తూ వచ్చారు. సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. కీలక నిర్ణయాలతో హోరెత్తిస్తున్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Improves his Speed
తాజాగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కావాల్సిన చర్యలకు శ్రీకారం చుట్టారు సీఎం. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఇదే సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి.
ఇందులో భాగంగా సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నిజాయతీ కలిగిన సీనీయర్ ఆఫీసర్ శేషాద్రిని నియమించారు. అంతేకాకుండా పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ ఆఫీసర్ గా పేరు పొందిన శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా అప్పగించారు రేవంత్ రెడ్డి.
దీంతో గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు రేగుతోంది. మరో వైపు విద్యుత్ శాఖలో రూ. 85 వేల కోట్లకు పైగా అప్పులు ఎలా పేరుకు పోయాయని ప్రశ్నించారు సమీక్ష సందర్భంగా. నిన్న కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీఐ)ను సందర్శించారు.
అక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇక్కడ సీఎం క్యాంపు ఆఫీసు పెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీసినట్లు సమాచారం.
Also Read : VC Sajjanar : ఉచిత ప్రయాణం గుర్తింపు కార్డు ముఖ్యం