Revanth Reddy Sale : కాంగ్రెస్ టికెట్స్ ఫర్ సేల్
రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు
Revanth Reddy Sale : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని రేటెంత రెడ్డి అని పేరు పెట్టారు. ఆపై టికెట్ల కోసం ఓ దుకాణం తెరిచాడని, అందినంత మేర దండుకుంటున్నాడంటూ ఆరోపించారు.
Revanth Reddy Sale Viral
టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న కురుమ విజయ్ కుమార్ , రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీం బాబా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నేరుగా పార్టీ చీఫ్ పై, ఎన్నికల కమిషనర్ కు , కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఆపై చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రజల సాక్షిగా ప్రమాణం చేశారు.
ఇప్పటి వరకు 60 సీట్లకు గాను రూ. 600 కోట్లకు అమ్ముకున్నాడని , దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఆ ముగ్గురు నేతలు. ఇదిలా ఉండగా టికెట్లు కేవలం సర్వేల ఆధారంగా కేటాయించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తాను పట్టించుకునే స్థితిలో లేనన్నారు టీపీసీసీ చీఫ్.
Also Read : CM KCR : చిల్లరగాళ్లకు చుక్కలు చూపించండి