Revanth Reddy : బీఆర్ఎస్ పతనం కాంగ్రెస్ విజయం
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : కొడంగల్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీలో ఉన్నారు. గురువారం కొడంగల్ లో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Revanth Reddy Comments Viral
బీఆర్ఎస్ అధికార మదంతో ప్రజలలో అనుమానాలు కలిగించేందుకు, పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. కానీ వీటిని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. స్వేచ్ఛగా తమ విలువైన ఓటు వినియోగించుకునేలా ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర భవితవ్యం బాగు పడాలంటే ఓటు వేసి తీరాలన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే పలు చోట్ల ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు, గూండాలు తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని, తాము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). బీఆర్ఎస్ పతనం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి తీరుతుందన్నారు టీపీసీసీ చీఫ్.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సిన సమయం ఆసన్నమైందని 9న లాల్ బహదూర్ స్టేడియంలో తాము ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read : Barrelakka Vote : ఓటు వేసిన బర్రెలక్క