Revanth Reddy : రైతుల‌కు 3 గంట‌లు క‌రెంట్ చాలు – రేవంత్

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నిన్న తానా స‌భ‌లో తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను సీఎం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇవాళ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి 24 గంట‌లు విద్యుత్ అవ‌స‌రం లేద‌న్నారు. అమెరికా ప‌ర్య‌ట‌నలో ఉన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). టూర్ లో భాగంగా తానా స‌భ‌లో మాట్లాడారు. ప్ర‌వాస ఆంధ్రులు (తెలుగు) వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఇవ్వ వ‌ద్ద‌ని అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోజంతా క‌రెంట్ ఇవ్వ‌డం వ‌ల్ల స్టార్ట‌ర్లు, మోటార్లు పెద్ద ఎత్తున కాలిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల పెద్ద ఎత్తున న‌ష్టాల‌కు గుర‌వుతున్నారంటూ పేర్కొన్నారు. పొద్ద‌స్త‌మానం రోజంతా క‌రెంట్ ఇవ్వ‌డం కంటే రోజులో ఏదో ఒక స‌మ‌యంలో మూడు గంట‌ల పాటు స‌ర‌ఫ‌రా చేస్తే బావుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు రేవంత్ రెడ్డి.

సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆయ‌న అన‌వ‌స‌రంగా ఉచితాలు ఇస్తూ జ‌నాన్ని మోసం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. దీని వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాపై అధిక భారం ప‌డుతుంద‌న్నారు టీపీసీసీ చీఫ్‌.

Also Read : RS Praveen Kumar : దొర భూ దాహం తెలంగాణ‌కు శాపం

 

Leave A Reply

Your Email Id will not be published!