Revanth Reddy : జ‌గ్గ‌న్న పార్టీలోనే ఉంటారు – రేవంత్

అదంతా టీ క‌ప్పులో తుపాను

Revanth Reddy  : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ్గారెడ్డి విష‌యంపై స్పందించారు.

ఆయ‌న పార్టీని మారుతున్నార‌న్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy ). ఇవాళ మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పార్టీలో ఇవ‌న్నీ మామూలేన‌ని పేర్కొన్నారు. ఏ పార్టీలో లేని స్వేచ్ఛ‌, అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసే అవ‌కాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉంద‌న్నారు. ఇంకే పార్టీ కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోద‌న్నారు.

భేదాభిప్రాయాలే త‌ప్ప త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు అన్న‌వి లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అంద‌రి కుటుంబాల్లో క‌ల‌హాలు ఉన్న‌ట్లే ఇక్క‌డ కూడా ఉంటాయ‌ని దానిని భూత‌ద్దంలో చూడ‌టం మాను కోవాల‌న్నారు.

ప్రాంతీయ పార్టీల్లో ఏక‌త్వంలో మూర్ఖ‌త్వం ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ అని , త్వ‌ర‌లోనే అన్నీ స‌ర్దుకుంటాయ‌ని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లు కావాల‌ని చేసిన‌వి కావ‌న్నారు.

అంద‌రినీ తాను అన‌లేద‌ని కొంద‌రు అధికార పార్టీకి వ‌త్తాసు ప‌లుకుతూ త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అకార‌ణంగా కొట్ట‌డం, దాడికి పాల్ప‌డం, అరెస్ట్ చేయ‌డాన్ని ప్ర‌శ్నించాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy )

ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ నిర‌స‌న‌, ఆందోళ‌న చేసే హ‌క్కు ఉంటుంద‌ని దానిని విస్మ‌రించిన స‌ర్కార‌కు త‌గిన రీతిలో బుద్ది చెబుతామ‌న్నారు రేవంత్ రెడ్డి.

Also Read : పార్టీని వీడ‌డం ఖాయం – జ‌గ్గారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!