Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి నక్సలైట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ అరాచక పాలనలో నక్సలైట్లు ఉంటే బావుండేదన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కేసీఆర్, కొడుకు కేటీఆర్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, ఈ రోజు వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. పోస్టులు భర్తీ చేయాలని కోరడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
పోలీసులు కేసీఆర్ ప్రభుత్వానికి బానిసలుగా మారారని ఆరోపించారు. ఎవరైనా చని పోతే మూడు రోజులు చేస్తారని, దేశంలో ప్రముఖులు కాలం చేస్తే సంతాప దినాలు ప్రకటిస్తారని అన్నారు.
ఈ సీఎం ఏం చేసిండని మూడు రోజులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతారని నిలదీశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy ). ఎక్కడికక్కడ తమ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులను తీవ్రంగా కొట్టారని తాను ఫోన్ చేసినా డీజీపీ ఫోన్ ఎత్తడం లేదంటూ ఫైర్ అయ్యారు.
ఎంతో మంది తమ ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరు త్యాగం చేయలేదని అన్నారు. అంతకు ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
సాయంత్రం వదిలి పెట్టాక ఆయన మీడియాతో మాట్లాడారు. సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్ ఫ్యామిలీపై. ఇక పై ప్రతి ఏటా ఫిబ్రవరి 17న నిరుద్యోగ నిరసన దినంగా జరుపుతామని ప్రకటించారు.
టీఆర్ఎస్ సర్కార్ తీరు చూస్తుంటే నక్సల్స్ ఉంటేనే బాగుండని అనిపిస్తోందని చెప్పారు.
Also Read : కేసీఆర్ కు మోదీ శుభాకాంక్షలు