Revanth Reddy : ఇక సంబురాలు జ‌రుపుకోండి

పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని 5 రాష్ట్రాల‌కు సంబంధించి అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు.

Revanth Reddy Comment

ద‌స‌రా పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపు కోవాల‌ని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆయ‌న పీడ విరుగ‌డ‌య్యే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. ఇక ఫాం హౌస్ కే ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌న్నారు. విశ్రాంతి తీసుకుంటే బెట‌ర్ అన్నారు. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ల‌క్ష కోట్ల రూపాయ‌లు, 10 వేల ఎక‌రాలు సంపాదించారని ఆరోపించారు.

తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని ప్ర‌జ‌ల ప‌రం చేస్తామ‌న్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలే త‌మ అభ్య‌ర్థుల‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). దొర పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగి పోయార‌ని, అన్ని వ‌ర్గాల వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ఆరు వారాలు ఓపిక ప‌డితే చాలు అని అన్నారు టీపీసీసీ చీఫ్‌.

తుక్కుగూడ వేదిక‌గా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సోనియా గాంధీ ఆరు హామీలు ప్ర‌క‌టించిన నాటి నుంచే కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుంద‌ని, జ్వ‌రం స్టార్ట్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. డిసెంబ‌ర్ లో మ‌రో అద్భుతం జ‌ర‌గ బోతోంద‌న్నారు.

Also Read : AP CM YS Jagan : బాబు అరెస్ట్ లో నా ప్ర‌మేయం లేదు

Leave A Reply

Your Email Id will not be published!