Revanth Reddy : ధ‌ర‌ణిపై విచార‌ణ చేప‌ట్టాలి – రేవంత్

ప‌లు కంపెనీలు ఉన్నాయ‌ని ఆరోప‌ణ

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ధ‌ర‌ణి పై వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ల‌క్షలాది ఎక‌రాలు అన్యాక్రాంతం అయ్యాయ‌ని, ధ‌ర‌ణి కార‌ణంగా వేలాది కుటుంబాలు బ‌జారున ప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి.

ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ వెనుక ఎన్నో కంపెనీలు ఉన్నాయ‌ని, విలువైన ప‌త్రాల వివ‌రాలు విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళితే ఎంత ప్ర‌మాదమో గుర్తించాల‌ని హెచ్చిరంచారు. ప్ర‌భుత్వానికి చెందిన విలువైన భూముల‌ను త‌మ వారికి ధారాద‌త్తం చేసేందుకే ఈ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని , వ‌చ్చాక వెంట‌నే ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మొత్తం ధ‌ర‌ణి ద్వారా జ‌రిగిన క్ర‌య విక్ర‌యాలు, లావా దేవీల‌కు సంబంధించిన వివ‌రాలపై విచార‌ణ చేప‌డ‌తామ‌ని, అందులో దోషుల‌ను జైలుకు పంపిస్తామ‌ని హెచ్చ‌రించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్ ఫ్యామిలీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గంప గుత్త‌గా ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకుని విలువైన భూముల‌ను కాజేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

ఇదే స‌మ‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను బీజేపీ మళ్లీ మోసం చేసింద‌న్నారు.

Also Read : Arvind Kejriwal : రోబోటిక్స్ తో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

 

Leave A Reply

Your Email Id will not be published!