Revanth Reddy : మార్పు తథ్యం విజయం ఖాయం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. అభివృద్దికి నమూనా తమ మేనిఫెస్టో అని పేర్కొన్నారు.
Revanth Reddy Comment
తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు తెర లేపారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఎవరిని ఉద్దరించడానికి కాళేశ్వరం కట్టారో చెప్పాలని నిలదీశారు.
ఏకంగా ప్రజలకు సంబంధించిన రూ. 1,20,000 కోట్లు ఖర్చు చేశారని, ప్రజా ధనాన్ని నీళ్ల పాలు చేశారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అంతులేని అవినీతికి మేడిగడ్డ బ్యారేజ్ బలై పోయిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతి అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని, ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.
Also Read : Guvvala Balaraju : అచ్చంపేట ఎమ్మెల్యేపై దాడి