Revanth Reddy : కేసీఆర్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు

నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధ‌వారం హైద‌రాబాద్ లో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ప‌రిర‌క్ష‌ణ అనే అంశంపై అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది.

మ‌హిళ‌లు పగ‌టి పూట కూడా తిర‌గ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. న‌గ‌రం న‌డిబొడ్డున మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం జ‌రిగితే ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం స్పందించిన పాపాన పోలేద‌న్నారు.

దేశ‌మంతా గగ్గోలు పెడితే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో నిద్ర పోయార‌ని ఆరోపించారు. ఇందు కోస‌మేనా త‌న‌ను గెలిపించామ‌న్నారు. కొడుకు ట్వీట్ కే ప‌రిమిత‌మైతే కూతురు క‌విత ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్లెత్తు మాట కూడా మాట్లాడ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

ఇక దేవుళ్ల పేరుతో రాజ‌కీయాలు చేసే బీజేపీ ఎందుకు మౌనం వ‌హించింద‌ని ప్ర‌శ్నించారు. జూబ్లీ హిల్స్ కేసులో 8 మంది అని సీపీ ఆనంద్ చెప్పార‌ని , కానీ ఆరు మందినే ప‌ట్టుకున్నామంటున్నార‌ని ఇదెక్క‌డి పోలీస్ వ్య‌వ‌స్థ అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉన్న వారికే కీల‌క పోస్టులు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. మ‌ద్యం వ‌ల్ల‌నే అని అన‌ర్థాలు చోటు చేసుకున్నాయ‌ని, ముందు రాష్ట్ర వ్యాప్తంగా స‌ద‌స్సులు, స‌మావేశాలు, అవ‌గాహ‌న శిబిరాలు, ర్యాలీలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు టీజేఎస్ చీఫ్ కోదండరామ్.

మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించు కోవాల‌ని పిలుపునిచ్చారు. ఇంత జ‌రిగినా సీఎం స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బాధితురాలికి భ‌రోసా క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

చెరుకు సుధాక‌ర్ మాట్లాడుతూ ఇప్ప‌టికే తాగుబోతుల రాష్ట్రంగా మార్చార‌ని, ఇది మారాల‌న్నారు. ఇందుకు మ‌నంద‌రం ఉద్య‌మించాల‌న్నారు.

Also Read : మోదీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు

Leave A Reply

Your Email Id will not be published!