Revanth Reddy : కేసీఆర్ నిర్వాకం రాజ్యాంగానికి అవ‌మానం

బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌న్న రేవంత్ రెడ్డి

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత రాజ్యాంగాన్ని అవ‌మాన ప‌రిచిన సీఎం కేసీఆర్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడుతూ కీల‌క అంశాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కేసీఆర్ కు ముందు నుంచి భార‌త రాజ్యంగం ప‌ట్ల న‌మ్మ‌కం లేద‌న్నారు. అందుకే రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత రెడ్డి.

ఇక భారత రాష్ట్ర స‌మితి నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్ర‌స్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యేల‌కు ఆ పార్టీ ప‌ట్ల న‌మ్మ‌కం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ కేవ‌లం ఉనికి కోస‌మే చేరార‌ని, వారిని కూడా కాషాయ పార్టీ ప‌ట్టించు కోవ‌డం మానేసింద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా ఈటెల రాజేంద‌ర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోక‌డ‌, రాచ‌రిక ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి త‌ట్టుకోలేక రాజేంద‌ర్ యుద్దం చేశాడ‌ని, కానీ ఆయ‌న టార్గెట్ అంతా కేసీఆర్ ను ప‌ద‌వి నుంచి గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. కానీ ఈటెల‌ను బీజేపీ ప‌ట్టించు కోదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). విచిత్రం ఏమిటంటే బీజేపీలో కూడా కేసీఆర్ కు చెందిన కోవ‌ర్టులు ఉన్నార‌ని చేరిన త‌ర్వాత రాజేంద‌ర్ కు అర్థ‌మైంద‌న్నారు. కేసీఆర్ మామూలోడు కాద‌ని అన్ని పార్టీల‌లో త‌న మ‌నుషుల‌ను పెట్టాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : ప్ర‌భుత్వ నిర్వాకం రాజ్యాంగానికి అవ‌మానం

Leave A Reply

Your Email Id will not be published!