Revanth Reddy : సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటేనంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచిన బీఆర్ఎస్ , ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేడంటూ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
Revanth Reddy Said
ఈ ఊసర వెల్లులు గురించి కమ్యూనిస్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే సమాజానికి అంత మంచిదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇద్దరూ అవకాశవాదులంటూ ఆరోపించారు. తెలంగాణ పేరుతో పవర్ లోకి వచ్చిన వీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు ఉద్యమ సమయంలో హరీశ్ రావుకు కిరోసిన్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదని , ఇక మామ కేసీఆర్ దొంగ దీక్ష ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు రేవంత్ రెడ్డి. ఇద్దరూ ఇప్పుడు అమరవీరుల త్యాగాల పునాదుల తో పదవులు అనుభవిస్తున్నారంటూ వాపోయారు టీపీసీసీ చీఫ్.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజలు రాబోయే కాలంలో బండకేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Pratibha Shukla : టమాటా ధరలు పెరిగితే తినొద్దు ‘రూ. 150’