Revanth Reddy : కాళేశ్వ‌రం మోసం కేసీఆర్ కు శాపం

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఎవ‌రైనా చెబుతార‌ని అన్నారు. ల‌క్షా 20 వేల కోట్ల ప్ర‌జా ధనాన్ని కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో నీళ్ల‌పాలు చేశాడ‌ని ఆరోపించారు. మేడిగ‌డ్డ బ్యారేజ్ పిల్ల‌ర్లు ఎలా కూలి పోతాయంటూ ప్ర‌శ్నించారు. ఎవ‌రి ప్ర‌మేయం ఉంద‌నే విష‌యం తేల్చాల‌ని డిమాండ్ చేశారు. తాము వ‌చ్చాక క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జైలు పాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Revanth Reddy Serious Comments on CM KCR

కాళేశ్వ‌రం ప్రాజెక్టును కేసీఆర్ బ‌లి తీసుకుంటే ఆ ప్రాజెక్టే కేసీఆర్ ను బొంద పెట్టుడు ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్ అంటే కాళేశ్వ‌రమ‌ని , కానీ ఆయ‌న‌కు ఆ పేరు పోయి కొత్త పేరు వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడంతా కేసీఆర్ ను క‌రప్ష‌న్ రావు అంటున్నార‌ని ఎద్దేవా చేశార‌. ల‌క్ష కోట్ల‌కు పైగా అవినీతి చోటు చేసుకుంద‌న్నారు.

అందుకే తమ పార్టీ ఆధ్వ‌ర్యంలో కాళేశ్వ‌రం ఏటీఎంల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి అపూర్వ‌మైన స్పంద‌న వ‌స్తోంద‌న్నారు. కొన్ని స‌ర్వే సంస్థ‌లకు డ‌బ్బులు ఇచ్చి మ్యానేజ్ చేస్తున్నార‌ని , ఎంత‌గా మోదీ ప్ర‌య‌త్నం చేసినా, జాకీ పెట్టి లేపినా కారు పంక్చ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి.

Also Read : Babu Mohan : ‘బాబు’ బ‌రిలో ఉంటారా

Leave A Reply

Your Email Id will not be published!