Revanth Reddy : కాళేశ్వరంపై విచారణ చేపట్టాలి
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై షాకింగ్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే లక్షా 20 వేల కోట్లు దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా ఎందుకని మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందని ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
Revanth Reddy Comment About Kaleshwaram
తాము గత కొంత కాలం నుంచి కాళేశ్వరం అవినీతి గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ , నిలదీస్తూ వచ్చామని దానిని కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశాడంటూ మండిపడ్డారు. ఇవాళ కేంద్ర జలశక్తి ఆధీనంలోని ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ టీమ్ పూర్తిగా నిర్ధారించిందని ఇక దీనిపై సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ఏకి పారేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తనకు అవినీతి వాసనే పడదంటూ చిలుక పలుకులు పలుకుతున్న పీఎం మోదీ మరి మేడిగడ్డ బ్యారేజీ కరప్షన్ కనిపించడం లేదా అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read : Komatireddy Venkat Reddy : వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్