Revanth Reddy : కాంట్రాక్టుల కోసమే పార్టీని వీడారు
రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి మునుగోడు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లా లోని చండూరు లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంట్రాక్టుల కోసమే పార్టీని వీడారంటూ మండిపడ్డారు. గత ఎన్నికలలో మునుగోడు టికెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది కానీ రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు.
నమ్మిన కార్యకర్తలను మోసం చేసి కేంద్ర మంత్రి అమిత్ షా పంచన చేరాన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మకు ధమ్కీ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అలాంటి హింసిస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. కలిసి పోరాడేందుకు ఏనాడూ రాజగోపాల్ రెడ్డి ముందుకు రాలేదన్నారు. ఆయన ఒక్కడు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
తమ పార్టీని ఎదుర్కొనలేక ప్రధాన మంత్రి , కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.
తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి రాజగోపాల్ రెడ్డి ఉన్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించాడు. మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించాలని ..పార్టీ ద్రోహులకు బుద్ది చెప్పాలని పిలుపు ఇచ్చారు. టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్ను పోటు పొడిచిన రాజ గోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా కన్నెర్ర