Revanth Reddy : డ్రామా రావు నీ ఆటలు సాగవు
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు. అయితే ఇది పూర్తిగా తప్పు పట్టారు. కేవలం కట్టు కథలకు పుట్టినిల్లు కల్వకుంట్ల కుటుంబమని పేర్కొన్నారు. ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు బీఆర్ఎస్ వేసిన ప్లాన్ గా కొట్టి పారేశారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Slams BRS Party
ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయాలకు వాడుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇదంతా కేవలం ప్రచారం కోసం తప్ప ప్రజల కోసం కాదని తేలి పోయిందన్నారు. కేటీఆర్ లాంటి డ్రామారావు వేసే వేషాలు ఇక ఇక్కడ చెల్లవన్నారు.
ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపినా చివరకు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తమ పార్టీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి భయం పట్టుకుందనేది అర్థమై పోయిందన్నారు.
ఇక ప్రజలు ఏనాడో డిసైడ్ అయ్యారని , మార్పు తథ్యమని జోష్యం చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దోచుకున్న సొమ్మున్నంతా కక్కిస్తామని హెచ్చరించారు.
Also Read : Raj Gopal Reddy : రామోజీతో రాజగోపాల్ భేటీ