Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆ రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఆ పార్టీలు రైతులను మోసం చేయడంలో ఘనత వహించాయంటూ ఎద్దేవా చేశారు.
ఈరోజు వరకు ఎంఎస్పీ చట్టం తీసుకు రాలేదన్నారు. ఇక్కడ తిట్టు కోవడం ఢిల్లీలో దోస్తీ చేయడం అలవాటుగా మారిందన్నారు. జనం చెవుల్లో పూలు పెట్టడంలో మోదీ, కేసీఆర్ (KCR) ఆరి తేరారని ఆరోపించారు.
రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఏ రకమైన నిబద్ధత ఉందనేది దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ వైపు అన్నదాతలు ఇబ్బందులు పడుతుందే రాజకీయాలు చేయడంలో కేసీఆర్ (KCR) బిజీగా మారరంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి (Revanth Reddy).
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వాలు ప్రత్యక్షంగా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. అయితే 60 ఏళ్లు ఉన్న కాంగ్రెస్ (Congress) చేయలేని పనిని తాము చేసి చూపించామంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంపై సీరియస్ అయ్యారు.
తండ్రీ, కొడుకుల అజ్ఞానం చూస్తే నవ్వు వస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ పార్టీ ఏం చేసిందో నీకంటే మీ నాయినకే ఎక్కువగా తెలుసన్నారు.
4 కోట్ల ప్రజల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ (Congress) పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ హయాంలో 7 వేల మంది రైతులు చని పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి కుటుంబాల శాపాలు తప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీకి తగులుతాయని పేర్కొన్నారు. కేటీఆర్ ను చూస్తే జాలేస్తోందన్నారు.
Also Read : బండి యాత్రకు ట్రబుల్ షూటర్