Revanth Reddy : హైదరాబాద్ – ఓ వైపు దేశంలో తాజాగా 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ రాష్ట్రాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమయంలో తెలంగాణలో మాత్రం ఊహించని రీతిలో 10 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Revanth Reddy Got Support from Gandhi Family
ఈసారి ఎన్నికలలో గాంధీ కుటుంబం విస్తృతంగా ప్రచారం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు ఎక్కడికి వెళ్లినా జనం నుంచి భారీ ఆదరణ లభించింది. లక్షలాది మంది తండోప తండాలుగా తరలి వచ్చారు.
అన్నా చెల్లెలు అత్యంత సంతోషానికి లోనైంది. మొత్తంగా అన్నీ తానై వ్యవహరించాడు రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఈ డైనమిక్ లీడర్ ఏది మాట్లాడినా , ఏది చేసినా అది ఓ సంచలనంగా మారారు.
మొత్తంగా తాను చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా చేశాడు. మొత్తంగా గాంధీ కుటుంంలో ఒకడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దటీజ్ డైనమిక్ లీడర్.
Also Read : Revanth Reddy CM : హోటల్ లోనే రేవంత్ రెడ్డి మకాం
