Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ – థరూర్
ఆధారాలు ఉన్నాయంటూ ఆరోపణలు
Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల ప్రకటన బుధవారం ప్రకటించనుంది పార్టీ. ఈ మేరకు అధికారికంగా వెల్లడించనున్నారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. ఇదిలా ఉండగా ఇవాళ మీడియాతో మాట్లాడారు చీఫ్ రేసులో ఉన్న ఎంపీ శశి థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
ఆపై ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో శశి థరూర్(Shashi Tharoor) చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. మరో వైపు మల్లికార్జున్ ఖర్గే గెలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఎన్నిక పూర్తయిందని ఇక ప్రకటించడమే మిగిలి ఉందని టాక్. ఎందుకంటే మొదటి నుంచీ ఖర్గే గాంధీ ఫ్యామిలీకి లాయల్ (విధేయుడి)గా ఉంటూ వచ్చారు.
ఇదిలా ఉండగా ఉదయం 10 గంటలకు ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ వెంటనే శశి థరూర్ టీం అనేక సమస్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లలో తొలిసారిగా గాంధీ ఫ్యామిలీకి చెందిన వారు రేసులో లేరని ఓటింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు శశి థరూర్(Shashi Tharoor).
ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పోలింగ్ తేదీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మిస్త్రీకి తెలియ చేస్తూ వచ్చామని చెప్పారు ఎంపీ. యూపీలో జరిగిన ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు శశి థరూర్.
Also Read : హిమాచల్ బీజేపీ అభ్యర్థులు డిక్లేర్