Right To Privacy : ప్రైవసీ అన్నది పర్మినెంట్ కాదు – కేంద్రం
వ్యక్తిగత సమాచారం హక్కు కానేరదు
Right To Privacy : కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ వచ్చాక తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సోషల్ మీడియా, పౌరుల వ్యక్తిగత భద్రత, సమాచారం, గోప్యత(Right To Privacy) అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. ప్రైవసీ అన్నది అత్యంత ముఖ్యమైనదని ప్రపంచ వ్యాప్తంగా అనుకుంటున్నదే. కానీ మోదీ సర్కార్ మాత్రం అలాంటిది ఏమీ లేదని అంటోంది.
ఇదే విషయాన్ని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానానికి స్పష్టం చేసింది ఇది పూర్తిగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రతి ఒక్క పౌరుడికి ఈ దేశంలో హక్కులుఉంటాయని, కానీ ఇదే సమయంలో దేశానికి భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తామంటే ఎలా ఊరుకుంటామని పేర్కొంది. గోప్యత(Right To Privacy) కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, తాము కూడా గౌరవిస్తామని కానీ అదే సంపూర్ణం అని భావిస్తే ఊరుకోబోమని కుండ బద్దలు కొట్టింది.
ఇందులో భాగంగా వ్యక్తిగత సమాచారం, పొందు పరిచిన వివరాలు, డిజిటల్ లో ఇప్పటి వరకు నమోదు చేసిన అంశాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వాటి లోని కంటెంట్ ను స్వాధీనం చేసుకోవడం, పరిశీలించడం వీలైతే జప్తు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
వీటిన్నింటిని నియంత్రించాలని అనుకోవడం మంచి పద్దతి కాదని సూచించింది. ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం కూడా పునరాలోచించాలని కోరింది కేంద్రం. ఇదిలా ఉండగా ధర్మాసనం కేంద్రం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందక పోవడం విశేషం.
Also Read : ‘బాబా’ నిర్వాకం మహిళా కమిషన్ ఆగ్రహం