Rishad Premji : సమగ్రతకు భంగం కలిగితే వేటు తప్పదు
విప్రో కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
Rishad Premji : ఈ దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ఐటీ కంపెనీలలో విప్రో ఒకటి. అంతే కాదు క్రమశిక్షణకు, సమర్థతకు , నిజాయితీకి, కష్టపడి పని చేసే వారికి ప్రయారిటీ ఇస్తుంది ఆ సంస్థ. అయితే ఇటీవల కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది ఉద్యోగులు కంపెనీలకు వెళ్లడం లేదు.
ఇంటి వద్ద నుండి పని చేసేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా విప్రో బాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమగ్రతకు భంగం కలిగించారని భావించిన విప్రో బాస్ , చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ(Rishad Premji) తన కంపెనీకి చెందిన టాప్ లీడర్ ను కేవలం 10 నిమిషాల్లోనే తొలగించారు.
దానికి బిగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా కొందరు తీసి వేస్తే విప్రో చైర్మన్ మాత్రం కీలకమైన నోట్ రాస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విప్రోలోనే కాదు ప్రపంచంలోని ఐటీ , తదితర కంపెనీలలో రిషద్ ప్రేమ్ జీ తీసుకున్న నిర్ణయాన్ని చూసి విస్తు పోతున్నారు.
ప్రస్తుతం విప్రోలో టాప్ ఎగ్జిక్యూటివ్ లు 20 మంది ఉన్నారు. వారిలో ఒకరిని తీసి వేశారు. ఇదే విషయాన్ని రిషద్ ప్రేమ్ జీ బెంగళూరులో జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ ఎన్ క్లేవ్ లో వెల్లడించారు. మూన్ లైట్ వ్యవహారంలో తన కంపెనీకి చెందిన 300 మంది ఉద్యోగులను తొలగించింది.
సీనియర్ ఉద్యోగులకు కూడా సమగ్రత ఉల్లంఘన నుండి మినహాయింపు లేదని స్పష్టం చేశారు రిషద్ ప్రేమ్ జీ. ఈ విషయాన్ని గుర్తించిన 10 నిమిషాల లోపే తొలగించామన్నారు చైర్మన్.
Also Read : భారీ వర్షం బెంగళూరు అస్తవ్యస్తం