Rishi Sunak : నాల్గో రౌండ్ లోనూ రిషి సునక్ హవా
ప్రధాన మంత్రి పదవికి అడుగు దూరంలో
Rishi Sunak : మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ప్రవాస భారతీయ మూలాలు కలిగిన, ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా మూర్తి కి అల్లుడైన రిషి సునక్(Rishi Sunak) హవా కొనసాగుతూనే ఉంది.
ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఓటింగ్ ముగిసింది. మూడింట్లోనూ టాప్ లో ఉన్నాడు రిషి సునక్. 19న జరిగిన నాలుగో రౌండ్ లో సైతం రిషికి ఎదురే లేకుండా పోయింది.
యుకె విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ , జూనియర్ వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్ చివరి దాకా పోటీ ఇచ్చారు. ఒకవేళ రిషి సునక్(Rishi Sunak) ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే సెప్టెంబర్ 5న కొత్త ప్రధాన మంత్రిగా కొలువు తీరుతారు.
ఆరవ సంతతికి చెందిన దేశాధినేత కానున్నాడు. బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుల మునుపటి రౌండ్ల ఓటింగ్ లో ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు. నాలుగో రౌండ్ లో తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు.
బోరిస్ జాన్సన్ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా , ప్రధానిగా రేసులో నిలిచాడు. లిజ్ ట్రస్ , పెన్నీ కూడా గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం పీఎం రేసు మూడుకు పడి పోయింది.
ఇక బ్రిటీష్ చట్ట సభ సభ్యులు పీఎం కావడానికి చివరి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కుంభ కోణంలో కూరుకు పోయిన అవుట్ గోయింగ్ నాయకుడు బోరిస్ జాన్సన్ ఈ నెల ప్రారంభంలో రాజీనామా చేశారు. ఆయన అనాలోచిత పోరాటాన్ని ప్రేరేపించారు.
Also Read : శ్రీలంక అధ్యక్షుడిగా విక్రమసింఘే