Rishi Sunak : బ్రిటన్ పీఎం రేసులో రిషి సునక్
పోటీలో ఉన్నానంటూ ప్రకటన
Rishi Sunak : బ్రిటన్ లో రాజకీయ సంక్షోభానికి తెర దించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రిగా ఉన్న బోరీస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు.
కానీ లోపాయికారిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రవాస భారతీయుడైన రిషి సునక్ (Rishi Sunak) తాను ప్రధాన మంత్రి పదవి రేసులో ఉన్నానని ప్రకటించాడు.
గత కొంత కాలం నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విలువలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు సునక్. ఆయన ఎవరో కాదు ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసీస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా నారాయణ మూర్తి కూతురును పెళ్లి చేసుకున్న వ్యక్తి. అంటే వారికి అల్లుడు.
తన తాత ముత్తాతలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. బతుకు దెరువు కోసం ఇంగ్లండ్ కు వచ్చారు. ఈ సందర్భంగా తన జీవితం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రిషి సునక్.
ఏ దేశమైనా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల్నే దేశాధినేతలుగా, ప్రధానమంత్రులుగా ఉండాలని కోరుకుంటుంది. తాను కూడా ఈరోజు వరకు అదే దిశగా ప్రయాణం చేస్తున్నానంటూ చెప్పారు.
అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి సునక్ కు (Rishi Sunak) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు రిషి సునక్ పేరు ప్రధానంగా పేరు ముందంజలో ఉంది. బోరీస్ జాన్సన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే తాను పీఎం బరిలో ఉన్నానని డిక్లేర్ చేశాడు సునక్.
మా అమ్మ ఎంతో కష్టపడింది. మా నాన్న కూడా అదే స్థాయిలో శ్రమించారు. కుటుంబం పిల్లల కోసం త్యాగం చేసింది. లక్షలాది మందికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తూ వచ్చానని చెప్పారు రిషి సునక్.
ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్న కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
Also Read : పీఎం పదవి వదులు కోవడం బాధాకరం