Rishi Sunak King Charles : కింగ్ చార్లెస్ ను క‌లుసుకున్న ‘సున‌క్’

త్వ‌ర‌లో బ్రిట‌న్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం

Rishi Sunak King Charles : భార‌తీయ సంత‌తికి చెందిన మొట్ట మొద‌టి వ్య‌క్తి రిషి సున‌క్ బ్రిట‌న్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ్రిట‌న్ కింగ్ చార్లెస్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా మంగ‌ళ‌వారం క‌లుసుకున్నారు. బ్రిట‌న్ ప్ర‌ధానిగా ఎన్నికైన రిషి సున‌క్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు కింగ్ చార్లెస్(Rishi Sunak King Charles).

ఇటీవ‌లే రాణి ఎలిజ‌బెత్ -2 మ‌ర‌ణించారు. ఆ స‌మ‌యంలో లిజ్ ట్ర‌స్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్నారు. కానీ త‌ను దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కంట్రోల్ చేయ‌లేనంటూ , పాల‌న చేత కాదంటూ చేతులెత్తేసింది. చివ‌ర‌కు పీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో తిరిగి అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి రిషి సున‌క్ గ‌ట్టి పోటీని ఎదుర్కొన్నారు.

మాజీ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ , పెన్నీ మార్డెంట్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా ఎంపీల నుంచి కావాల్సిన మెజారిటీ మ‌ద్ద‌త‌ను కూడ‌గ‌ట్ట‌లేక పోయారు. దీంతో పీఎం రేసు నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు మాజీ పీఎం బోరిస్ జాన్స‌న్, ఇదే స‌మ‌యంలో 179 మందికి పైగా స‌భ్యులు ఏక‌గ్రీవంగా రిషి సున‌క్ ను ప్ర‌ధానిగా ఆమోదించారు.

దీంతో పెన్నీ మార్డెంట్ కూడా పోటీ నుంచి త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది. ఇక 200 ఏళ్ల బ్రిట‌న్ చ‌రిత్ర‌లో ఒక భార‌తీయుడు పీఎం ప‌ద‌విని అధీష్టించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. అంతే కాదు రిషి సున‌క్ వ‌య‌సు కేవ‌లం 42 ఏళ్లు మాత్ర‌మే.

రిషి సున‌క్ బ‌కింగ్ హాల్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ ను క‌లుసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా క్వీన్ ఎలిజ‌బెత్ మ‌ర‌ణం త‌ర్వాత కొత్త చ‌క్ర‌వ‌ర్తి చేత నియ‌మించ‌బ‌డిన మొద‌టి పీఎం అవుతారు సున‌క్.

Also Read : ఒబామాను గుర్తుకు తెచ్చిన సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!