Rishi Sunak : సల్మాన్ రష్డీపై దాడి ఓ హెచ్చరిక – సునక్
యుకె ప్రధాన మంత్రి బరిలో ఉన్న రిషి
Rishi Sunak : యుకె పీఎం రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన యుకె ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై న్యూయార్క్ నగరంలో ప్రసంగిస్తుండగా దాడికి గురయ్యారు.
ఆయన వెంటిలేటర్ పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. 1989లో ఇరాన్ మత గురువు ఆయతుల్లా ఖొమేనీ రష్డీపై ఫత్వా విధించారు. సల్మాన్ రష్డీ ది శాటనిక్ వర్సెస్ అనే పుస్తకం రాశాడు.
దానిని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్ముడు పోయింది. మంచి పేరు తీసుకు వచ్చింది.
అయితే ఈ పుస్తకం రాసిన తర్వాత ముస్లింలకు, టెర్రరిస్టులకు , మత పెద్దలకు కంటగింపుగా మారాడు రష్డీ. ఎందుకంటే ఇందులో రష్డీ ఇస్లాంను, మత చాందసవాదాన్ని, మహ్మద్ ప్రవక్తపై విమర్శలు చేశాడంటూ నిప్పులు చెరిగారు.
ఆనాటి నుంచి అంటే నేటి వరకు 33 ఏళ్ల తర్వాత న్యూ జెర్సీకి చెందిన ఓ దుండగుడు దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఇంకా ఇరాన్ స్పందించ లేదు. మరో వైపు స్వేచ్ఛను ప్రశ్నించే వారికి ఇది ఓ హెచ్చరిక లాంటిదంటూ వాపోతున్నారు మరికొందరు.
రష్డీపై ఆకస్మిక దాడిని తీవ్రంగా ఖండించారు రిషి సునక్(Rishi Sunak). ఇది సభ్య సమాజానికి ఓ హెచ్చరిక లేదా మేల్కొల్పు లాంటిదంటూ పేర్కొన్నారు.
రష్డీపై ఫత్వా జారీ చేసిన తర్వాత మొదటగా ఆయనకు రక్షణ కల్పించింది బ్రిటన్. అక్కడ ఆయన 56 సార్లు మారు వేషంలో సాధారణ జీవితం గడిపాడు. కానీ దాడికి గురి కావడం విస్తు పోయేలా చేసింది.
Also Read : సంక్షోభం అంచున పాకిస్తాన్ – ప్రధాని