RK Roja: క్రీడా శాఖలో వంద కోట్లు అవినీతి జరిగిందంటూ మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు !

క్రీడా శాఖలో వంద కోట్లు అవినీతి జరిగిందంటూ మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు !

RK Roja: ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja), శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు. ఐదేళ్ళ కాలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని… వాటి ఆధారాలతో సహా అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశానన్నారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

RK Roja Scam..

ఈ సందర్భంగా ఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ… ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశాము. వారి హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, శాప్‌ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరాము. స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలి. నాటి కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ సీజ్‌ చేయాలని సీఐడీ అధికారులను కోరాము. ఐదేళ్ల కాలంలో శాప్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలని కోరామన్నారు. ఈ సమావేశంలో మోడరన్‌ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తుల అప్పలస్వామి, టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్‌.బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.

Also Read : Payyavula Keshav: మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!