RK Roja Pawan Kalyan : వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన మంత్రి ఆర్కే రోజా
RK Roja Pawan Kalyan : వాలంటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై నిప్పులు చెరిగారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను, మహిళలను కించ పర్చేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. మహిళల అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులలో దేశంలో 10వ స్థానంలో ఏపీ ఉందన్నారు. తెలంగాణ 6వ స్థానంలో ఉందని, మరి నాయకుడిగా ఎందుకు సీఎం కేసీఆర్ ను నిలదీయడం లేదని ప్రశ్నించారు.
మిస్సింగ్ కేసుల్లో టాప్ లో ఉన్న ఆ రాష్ట్ర సీఎం అంటే భయమా అని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లే తింటారంటావు..తిరిగి వాళ్ల కోసమే పని చేస్తానంటావు. ఎవరు క్రిమినల్స్ జనాలకు తెలుసన్నారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న సీఎం జగన్ రెడ్డిని తిట్టే అర్హత , నైతిక హక్కు లేదన్నారు ఆర్కే రోజా.
నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కావాలని దురుద్దేశ పూర్వకంగా పవన్ కామెంట్స్ చేశారంటూ మండిపడ్డారు. జగన్ ఏనాడైనా మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తాడా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ప్రజలు నిన్ను తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
Also Read : Ashish Mishra : ఆశిష్ మిశ్రా బెయిల్ పొడిగింపు