Rohit Sharma : బౌలింగ్ ఓకే ఫీల్డింగ్ దారుణం
కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్
Rohit Sharma : ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేపాల్ తో జరిగిన కీలక పోరులో భారత జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయైంది. ఇరు జట్లు చెరో పాయింట్ సాధించాయి.
Rohit Sharma Speaks about Yesterday Match
ఈ టోర్నీలో ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఈనెల 10న భారత్ ,పాకిస్తాన్ జట్లు కొలంబోలో తలపడనున్నాయి. నేపాల్ పై గెలుపొందాక మీడియాతో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడాడు. బౌలింగ్ పరంగా బాగుందని కానీ ఫీల్డింగ్ దారుణంగా ఉందన్నాడు.
చాలా పరుగులు ఇచ్చు కోవాల్సి వచ్చిందన్నాడు. 10 వికెట్ల తేడాతో గెలుపొందడం ఆనందం కలిగించినా తమను ఫీల్డింగ్ లో లోపాలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపాడు రోహిత్ శర్మ. పల్లెకెలె స్టేడియంలో 50 ఓవర్ల మ్యాచ్ ను అంపైర్లు 23 ఓవర్లకు కుదించారు.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. వర్షం కారణంగా 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. సూపర్ 4కు చేరుకుంది. ఇక మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read : PM Modi : మోదీతో జెన్సన్ హువాంగ్ భేటీ