Rohit Sharma : నువ్వా నేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడి పోయింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ . ఎప్పటి లాగే చివరి 19 ఓవర్ వరకు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వైపు ఉంది.
కానీ ఒకే ఒక్కడు మాత్రం కూల్ గా ఉన్నాడు. అతడు ఎవరో కాదు జార్ఖండ్ మైనెట్ , భారత జట్టుకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. కానీ 20 ఓవర్ లో మొత్తం మ్యాచ్ ను మార్చేశాడు.
ఆఖరు ఓవర్ లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరలో ఓవర్ వేసింది ఉనాద్కత్. ధోనీ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మరోసారి సత్తా చాటాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఓడి పోయే మ్యాచ్ ను గెలిపించాడు.
ఆటకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. దుమ్ము రేపాడు. జార్ఖండ్ డైనమెంట్ పేలాడు. ముంబైకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ లో అసలైన మజా వచ్చేలా చేసింది.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)మాట్లాడారు. ఉనాద్కత్ స్థానంలో ఇంకే స్టార్ బౌలర్ ఉన్నా ధోనీ ధాటిగా ఆడి ఉండేవాడని కితాబు ఇచ్చాడు.
ధోనీ ఆడక పోయి ఉండక పోతే , లేక పోయి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచి ఉండే వాళ్లమని అభిప్రాయం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. ఎప్పటి లాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడని పేర్కొన్నాడు.
Also Read : కథ కంచికి ముంబై ఇక ఇంటికే