Rohit Sharma : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ఫెవరేట్ టీమ్ గా పేరొందిన మాజీ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ఆ జట్టుతో పాటు మరో టీం చెన్నై సూపర్ కింగ్స్ కూడా సేమ్ సీన్ . వరుస పరాజయాలతో ఒత్తిడిని అనుభవిస్తున్న జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ(Rohit Sharma )కీలక వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ అనంతనం డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు రోహిత్ (Rohit Sharma )చేసిన ప్రసంగం నెట్టింట్లో వైరల్ గా మారింది. మన జట్టు అద్బుతమైంది.
మిగతా జట్లకు మనమేం తీసిపోం. కానీ ఓడి పోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదన్నాడు కెప్టెన్. ఈ సమయంలో మన జట్టుకు కావాల్సింది తెగింపు. గెలవాలన్న పట్టుదల. కోరిక బలీయంగా ఉండాలని సూచించాడు.
మనం గెలుపు అంచుల దాకా వచ్చాం. కానీ అనుకోని రీతిలో మనల్ని ఓటమి పలకరించింది. కోల్ కతా నైట్ రైడర్స్ మనం గెలుపు అంచుల దాకా వచ్చాం. కానీ ఎప్పుడైతే స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ వచ్చాడో ఇక మన మ్యాచ్ ను అతడి చేతుల్లోకి తీసుకున్నాడు.
బౌలింగ్ పరంగా కూడా కొంత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నాడు రోహిత్ శర్మ. ఇదిలా ఉండగా కమిన్స్ కీలకంగా మారాడు. మనం అతడిని త్వరగా అవుట్ చేయగలిగి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్లమన్నాడు.
తాను ఎవరినీ బాధ్యుల్ని చేయదల్చు కోలేదన్నాడు రోహిత్. ఈ లీగ్ లో తెగింపు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. బ్యాట్ కు బంతికి పని చెప్పాలన్నాడు. మనం నిరాశ పడాల్సిన పని లేదన్నాడు.
Also Read : తాగిన ఆటగాడు నన్ను వేలాడదీశాడు