Roopa Ganguly : బెంగాల్ లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించండి

నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ

Roopa Ganguly  : బెంగాల్ హ‌త్య‌ల‌పై ఇవాళ పార్ల‌మెంట్ ద‌ద్ద‌రిల్లింది. ఈ మార‌ణ హోమం ఇంకెంత కాలం సాగుతుంద‌ని ప్ర‌శ్నించారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ రూపా గంగూలీ(Roopa Ganguly ). రాష్ట్రంలోని బీర్బూమ్ లో ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు.

ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌లు, పిల్ల‌లు పూర్తిగా కాలి పోయారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ సీరియ‌స్ అయ్యారు. ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) లో ప్ర‌జ‌ల‌కు రక్ష‌ణ లేకుండా పోతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

అక్క‌డ ఎవ‌రూ ఉండ‌లేని ప‌రిస్థితి తీసుకు వ‌చ్చిందంటూ మండిప‌డ్డారు. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా బెంగాల్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆరోపించారు. పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ (CM Mamata Banerjee) నంటూ స్ప‌ష్టం చేశారు రూపా గంగూలీ(Roopa Ganguly ).

రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అక్క‌డ సామూహిక హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు టీఎంసీను చూస్తేనే జంకుతున్నార‌ని వాపోయారు.

రాష్ట్రం ఇక ఎంత మాత్రం ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఇవ్వ‌లేక పోతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇదిలా ఉండ‌గా బీర్బూమ్ సజీవ ద‌హ‌నం కు సంబంధించిన కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించ వ‌ద్దంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన విన్న‌పాన్ని కోల్ క‌త్తా హైకోర్టు పూర్తిగా తిర‌స్క‌రించింది.

పిటిష‌న్ ను కొట్టి వేస్తూ సీబీఐకి అప్ప‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు కేసును బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇక కేసును సీబీఐకి ఇవ్వ‌నుంది.

ఇదిలా ఉండ‌గా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లింద‌ని వెంట‌నే బెంగాల్ లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని రూపా గంగూలీ డిమాండ్ చేశారు.

Also Read : ఐదుగురు ఆప్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం

Leave A Reply

Your Email Id will not be published!