Roshan Mahanama : శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహానికి ప్రభుత్వం తలవంచే పరిస్థతి నెలకొంది. గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ఆకలి కేకలు, హాహాకారాలు కొనసాగుతున్నాయి.
ఆహారం, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చేత కావడం లేదు. ఇప్పటికే ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తో పాటు 26 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఆందోళనకారులకు మద్దతుగా శ్రీలంక దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు గళం ఎత్తారు. వారి తరపున తమ స్వరం వినిపిస్తున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా ఉన్న మహేళ జయవర్దనే, రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దేశం ఇలా తయారు కావడానికి పాలకులే కారణమని ఆరోపించారు. తాజాగా వారితో జత కలిపాడు మరో దిగ్గజ క్రికెటర్ రోహన్ మహనామా(Roshan Mahanama). శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం నాయకులేనంటూ ఆరోపించారు.
మార్పు రావాల్సిన అవసరం ఉందన్నాడు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే స్థితిలో పాలకులు లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితి రూపు మాపేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
నేను నా ఆటగాడిగా ఉన్న సమయంలో శ్రీలంక ప్రజలు నా వైపు నిలబడ్డారు. వారంతా ఇప్పుడు రోడ్లపైకి వచ్చారు. ఇక వారి తరపు మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు.
Also Read : పంజాబ్ నిలిచేనా గుజరాత్ గెలిచేనా