Rovman Powell IPL : పావెల్ పంట పండింది
రూ. 7.40 కోట్లకు రాజస్థాన్ కైవసం
Rovman Powell IPL : దుబాయ్ – బీసీసీఐ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ వేదికగా కొనసాగుతోంది. ఊహించని ధరకు అమ్ముడు పోయారు కొందరు ఆటగాళ్లు. ప్రధానంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు ఆసిస్ సారథి ప్యాట్ కమిన్స్ . ఏకంగా అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు తీసుకుంది. ఇది ఓ రికార్డ్.
Rovman Powell IPL Team
మరో వైపు విధ్వంసకరమైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు విండీస్ స్టార్ క్రికెటర్ రోమన్ పావెల్(Rovman Powell). తొలి ఆటగాడిగా వేలం పాటలోకి వచ్చాడు. ఆ వెంటనే పలు జట్ల యాజమాన్యాలు పోటీ పడ్డాయి పావెల్ ను తీసుకునేందుకు . కానీ చివరకు రోమన్ పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది.
ఆ మేనేజ్ మెంట్ ఏకంగా రూ. 7.40 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా రోమన్ ను కైవసం చేసుకునేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ కూడా పోటీ పడింది. అంతకు ముందు పావెల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది.
అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు రోమన్ పావెల్. అతడి ఆట విధ్వంసకరంగా ఉంటుంది. ఒక్కసారి మైదానంలోకి వచ్చాడంటే పరుగుల వరద పారించడం స్టార్ట్ చేస్తాడు. టీ20 లీగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది.
Also Read : Rachin Ravindra : ధోనీ చెంతకు రచిన్ రవీంద్ర