RR vs GT IPL Qualifier : చెలరేగిన బట్లర్ మెరిసిన శాంసన్
గుజరాత్ టైటాన్స్ ముందు 189 రన్స్
RR vs GT IPL Qualifier : ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో భాగంగా కోల్ కతా లో జరిగిన మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR vs GT IPL) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇక ఎప్పటి
లాగే గత కొన్ని మ్యాచ్ లలో నిరాశ పరిచిన ఇంగ్లాండ్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ మరోసారి సత్తా చాటాడు.
గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొని ఏకంగా 89 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్ లో పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచిన కెప్టెన్ సంజూ శాంసన్ రాణించాడు.
కీలకమైన ఈ మ్యాచ్ లో ఏకంగా 47 రన్స్ చేసి సత్తా చాటాడు. గుజరాత్ బౌలర్ల లో మహమ్మద్ షమీ, సాయి కిషోర్ , యశ్ దయాల్ , హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ పరంగా చూస్తే రాజస్తాన్ ప్రారంభంలోనే జోష్ మీదున్న పానీ కుర్రాడు యశస్వి జైస్వాల్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో
ఆది లోనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది.
కానీ ఆ తర్వాత ఆట స్వరూపాన్నే మార్చేశాడు. జైస్వాల్ ఔట్ తో బరిలోకి దిగిన కేరళ స్టార్ హిట్టర్ శాంసన్ వచ్చీ రావడంతోనే దంచి కొట్టాడు.
ఏకంగా 5 ఫోర్లు , 3 భారీ సిక్సర్లతో ఉతికి ఆరేశాడు.
ఓ వైపు జోస్ బట్లర్ సింగిల్స్ తీస్తూ సపోర్ట్ ఇచ్చాడు. అసలైన టైంలో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు శాంసన్. ఆ తర్వాత వచ్చిన దేవదత్
పడిక్కల్ 28 రన్స్ చేశాడు. ఈసారి హిట్ మైర్ 4 పరుగులే చేసి నిరాశ పరిచాడు.
ఇక జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 89 పరుగుల వద్ద లేని పరుగు కోసం రనౌట్ అయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో
రాజస్థాన్ రాయల్స్ (RR vs GT IPL) అద్భుతంగా ఆడింది. ఇక గుజరాత్ ఫీల్డింగ్ లో నిరాశ పరిచారు.
Also Read : బీసీసీఐ సెలెక్టర్లపై సర్వత్రా ఆగ్రహం