RRR Golden Temple : గోల్డెన్ టెంపుల్ లో ఆర్ఆర్ఆర్ టీం

ఆనందంగా ఉంద‌న్న తార‌క్..చెర్రి..జ‌క్క‌న్న‌

RRR Golden Temple  : జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Golden Temple )విడుద‌ల కానుంది. దీంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. నిన్న ఢిల్లీలో హ‌ల్ చ‌ల్ చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, న‌టులు తార‌క్, చెర్రీలు ఇవాళ దేశంలోనే ప్ర‌ముఖ ఆల‌యంగా పేరొందిన అమృత్ స‌ర్ ను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించి ప్రార్థ‌న‌లు చేశారు. ఇక్క‌డికి రావ‌డం త‌మ‌కు ఆనందంగా ఉంద‌న్నారు. ఆర్ఆర్ఆర్ మూవీని ఆద‌రించాల‌ని వారు కోరారు.

ఇప్ప‌టికే దుబాయ్ , బెంగ‌ళూరు లోని చిక్ బ‌ళ్లాపూర్ లో నిర్వ‌హించారు. అక్క‌డ భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంతకు ముందు చెన్నై, ముంబైలో ప్ర‌మోష‌న్ పూర్త‌యింది.

ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గుజ‌రాత్ లో కూడా ప‌ర్య‌టించారు. ఆర్ఆర్ఆర్ టీం (RRR Golden Temple )ఎక్క‌డికి వెళ్లినా అద్భుతైమ‌న ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

పంజాబీ సంప్ర‌దాయంలో ముగ్గురూ త‌ల‌కు వ‌స్త్రం చుట్టుకుని ప్రార్థ‌న‌లు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా జ‌క్క‌న్న మూడు సంవ‌త్స‌రాలు ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు, న‌టులు క‌లిసి చేసిన వీడియో వైర‌ల్ అయింది.

అంత‌కు ముందు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ నాటు నాటు పాట‌కు స్టెప్పులు వేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ ను త‌ల‌పించేలా ఆర్ఆర్ఆర్ ను తెర‌కెక్కించారు జ‌క్క‌న‌. కీర‌వాణి దీనికి సంగీతం అందించారు.

తొలి రోజే భారీ క‌లెక్ష‌న్లు వ‌స్తాయ‌ని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు. రూ. 300 కోట్లు ఖర్చు చేశార‌ని టాక్.

Also Read : దుష్ప్ర‌చారం ఆపండి వాళ్ల‌ను గౌర‌వించండి

Leave A Reply

Your Email Id will not be published!