AP Govt : ఏపీలో గ్రామ..వార్డులకు నిధుల వెల్లువ
సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం
AP Govt : ఏపీ సీఎంగా సందింటి జగన్మోహన్ రెడ్డి కొలువు తీరిన తర్వాత రాష్ట్ర స్వరూపమే పూర్తిగా మారి పోతోంది. ఆయన ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు.
విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సాధికారిత పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కీలక మార్పులు చేశారు. మౌలిక వసతుల కల్పనకు చర్యులు తీసుకుంటున్నారు.
రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆయా గ్రామ పంచాయతీలు, వార్డులకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం తాజాగా. గడప గడపకు మన ప్రభుత్వం(AP Govt) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆర్థిక పరమైన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తంగా రూ. 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఒక్కో గ్రామ సచివాలయంలో ఈ నిధుల కింద రూ. 20 లక్షల విలువైన పనులు చేపట్టనున్నారు.
ముఖ్యంగా తాగు నీరు, రోడ్లు, డ్రైయిన్లు, విద్యుత్, కల్వర్టులు, ఇతర సివిల్ పనులపై ఫోకస్ పెడతారు. కనిష్టంగా రూ. లక్ష గరిష్టంగా రూ. 20 లక్షలుగా ఖర్చు చేయాలని నిర్ణయించారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(AP Govt) .
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కచ్చితంగా నెలలో ఆరు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు 3, 055 గ్రామాలు, వార్డు సచివాలయాలను సందర్శించడం విశేషం. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ సత్తా చాటాలని ప్లాన్ చేశారు సీఎం.
ఇదిలా ఉండగా ప్రజా ప్రతినిధులు తమ తమ ప్రాంతాలలో ఫుల్ బిజీగా మారారు.
Also Read : వన్డే సీరీస్ పై కన్నేసిన భారత్