KTR : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
కేటీఆర్ యూకే, దావోస్ టూర్ సక్సెస్
KTR : పూర్తి ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉన్న మంత్రిగా పేరొందారు తెలంగాణకు చెందిన ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). ఆయన హయాంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ గా పేరొందింది.
మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలలో ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే కొలువు తీరాయి. దీని వెనుక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,
పరిశ్రమల, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కృషి ఉందనడంలో సందేహం లేదు. తాజాగా కేటీఆర్(KTR) యూకే, స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక ఫోరమ్ )లో పాల్గొన్నాడు.
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలకు భారీ ఎత్తున పెట్టబుడులు తీసుకు రావడంలో విజయం సాధించారు. ఇక శుక్రవారం నాటితో విదేశీ పర్యటన ముగిసింది కేటీఆర్ అండ్ టీంది.
యూకే, దావోస్ లలో 10 రోజుల పాటు పర్యటించారు కేటీఆర్. ఏకంగా రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను సాధించి పెట్టడంలో తీవ్రంగా కృషి చేశారని చెప్పక తప్పదు. 48 వాణిజ్య, 4 రౌండ్ టేబుల్ , 4 ప్యానెల్ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మంత్రి కేటీఆర్(KTR). తెలంగాణ రాష్ట్రానికి రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని తెలిపారు.
సక్సెస్ అయ్యేలా చేసినందుకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ టూర్ సాగింది.
Also Read : మేమే ప్రత్యామ్నాయం మార్పు అనివార్యం