RS Praveen Kumar : గవర్నర్ ను కలిసిన ప్రవీణ్ కుమార్
పేపర్ లీక్ పై విచారణ చేపట్టాలి
RS Praveen Kumar Governor : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీక్ ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు(RS Praveen Kumar Governor). ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టాలని విన్నవించారు. ఈ సందర్బంగా వినతిపత్రాన్ని గవర్నర్ తమిళి సైకి అందజేశారు. ఈ సందర్బంగా టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై వివరాలు తెలియ చేశారు.
ఈ మొత్తం వ్యవహారపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కోరారు. మొత్తం వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని, ఐఏఎస్ బి. జనార్దన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలని సూచించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం టీఎస్ పీఎస్సీ బాడీని పూర్తిగా రద్దు చేయాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ పేపర్ లీకేజీల వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్రపై కూడా విచారణ చేపట్టాలని కోరారు.
అనంతరం బీఎస్పీ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంబంధం ఉన్న ఎమ్మెల్సీ కవితను రక్షించే పనిలో కేబినెట్ మంత్రులు బిజీగా ఉన్నారని ఆరోపించారు ఆర్ఎస్పీ.
Also Read : సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి