RS Praveen Kumar : టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి – ఆర్ఎస్పీ
చైర్మన్..సీఎంపై కేసు నమోదు చేయాలి
RS Praveen Kumar TSPSC : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ఎపీస్సీ) లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరారు. సిట్ వల్ల ఎలాంటి న్యాయం జరగదన్నారు. వీరికి పవర్స్ ఉండవని, అసలు దోషులు ఎవరో తేలాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలన్నారు ఆర్ఎస్పీ. పరీక్షలను నిర్వహించలేని స్థితిలో ఉన్న టీఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశానని తెలిపారు. ప్రతి ఒక్కరు రాష్ట్రపతికి కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరుతూ లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
సోమవారం వరంగల్ లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో నిరుద్యోగ భరోసా కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిర్భంధించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని యూనివర్శిటీలను సీఎం ఒక్కసారైనా సందర్శించారా అని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. ఓట్ల కోసం తాను కేయూకు రాలేదన్నారు. విద్యార్థులను ఉగ్రవాదుల కంటే దారుణంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. అసమర్థ సీఎం ఉంటే లీకులు తప్ప ఇంకేవీ ఉండవని ఎద్దేవా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar TSPSC) .
చదువుకుంటున్న పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 2 లక్షల ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. మొత్తం టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : సీబీఐతో విచారణ జరిపించాలి