RS Praveen Kumar : జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
కేటీఆర్ కామెంట్స్ ఆర్ఎస్పీ ఫైర్
RS Praveen Kumar Janardhan Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో చోటు చేసుకున్న పేపర్ల లీకు వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని, ఉద్యోగ సంఘంలో పని చేస్తున్న వ్యక్తిని టీఎస్పీఎస్సీ లో సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. ఆదివారం బీఎస్పీ ఆఫీసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఏమీ జరగనట్లుగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నట్లు చెప్పడం దారుణమన్నారు.
2015 నుంచి టీఎస్ పీఎస్సీలో నేటి దాకా జరిగిన పరీక్షలు, ఎంపికైన వారి గురించి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ఇద్దరు మాత్రమే ఉన్నారంటూ చూపే ప్రయత్నం చేస్తున్నారని అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని అన్నారు. గతంలో జరిగిన పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఎంపికైనట్లు ఆరోపణలు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణను దోచుకుంటున్న వారు, మోసం చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని సూచించారు.
టీఎస్ పీస్సీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి(RS Praveen Kumar Janardhan Reddy) వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఆయనను మొదటి నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. వెబ్ సైట్ హ్యాక్ అయిందని చెప్పడం సిట్ కు అప్పగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. గవర్నర్ ను కలిశామని , సిట్ వల్ల ఉపయోగం లేదని సీబీఐతో విచారణ కు ఆదేశించాలని కోరుతున్నామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రి కేటీఆర్ అంతర్గతంగా సిట్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
Also Read : జాబ్స్ కోసం ఇంకెంత మంది చావాలి