RS Praveen Kumar : పల్లెల్లో అత్యాధునిక జిమ్ లు – ఆర్ఎస్పీ
బహుజన రాజ్యంలో అమలు చేస్తామని ప్రకటన
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా వ్యాయామశాలల ఆవశ్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. ఇదే సమయంలో బహుజన రాజ్యంలో అత్యాధునిక సదుపాయాలతో వ్యాయామశాలలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం తీసుకు వచ్చిన గల్లీలలో ఏర్పాటు చేసిన మందు షాపులను బంద్ చేస్తామని ప్రకటించారు.
ప్రజలకు కావాల్సింది బెల్టు షాపులు కాదని చదువుకునేందుకు పాఠశాలలు, బతికేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
తాను ఐపీఎస్ శిక్షణలో ఎంతో నేర్చుకున్నానని స్పష్టం చేశారు. ఎందుకంటే శిక్షణ అన్నది ముఖ్యమన్నారు. ఏ రంగంలో ఎదగాలంటే ముందుగా ట్రైనింగ్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. 195-96లో పోలీసు శిక్షకుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అందుకే బహుజన రాజ్యంలో జిమ్ ల ఏర్పాటు అత్యంత ముఖ్యమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించడం ఖాయమన్నారు ఆర్ఎస్పీ. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇకనైనా చైతన్యవంతం కావాలని లేక పోతే ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు.
Also Read : India Tightens Gold : పసిడి ప్రియులకు భారీ షాక్