RS Praveen Kumar : తెలంగాణ సర్కార్ పై జంగు సైరన్
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై జంగు సైరన్ మోగించాలని పిలుపునిచ్చారు. యువత లేక పోతే తెలంగాణ లేదన్నారు. ఆనాడు వారు చేసిన బలిదానం వల్లనే ఇవాళ రాష్ట్రం ఏర్పడిందని, కేసీఆర్ వల్ల రాలేదని సంచలన కామెంట్స్ చేశారు. అన్ని పార్టీలను ఏకం చేసిన ఘనత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అంటూ సెటైర్ చేశారు. పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
2016లో గ్రూప్ -1 టాపర్ ఎవరో చెప్పాలని , తాను అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క దానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ క్వాలిఫై కాలేదంటూ చిన్న విషయంగా తీసి పారేశారన్నారు. పేపర్ లీకేజీ విషయం చైర్మన్, కార్యదర్శి, సభ్యులకు కూడా తెలుసన్నారు. ఇక జవాబుదారీగా ఉండాల్సిన సర్కార్ నిద్ర పోతోందన్నారు.
పాలన పర్యవేక్షణ చేయాల్సిన సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్ర పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ లో సూత్రదారులు ప్రగతి భవన్ , బీఆర్ఎస్ లో ఉన్నారని ఆరోపించారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar). బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. సిట్ వల్ల లాభం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీతో విచారణ చేపట్టాలని అన్నారను బీఎస్పీ చీఫ్.
Also Read : మేడ్చల్ నుంచి పోటీ చేస్తా – మల్లన్న