RS Praveen Kumar : రైతుల‌కు శాపం ధ‌ర‌ణి దారుణం

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ధ‌ర‌ణి వ‌ల్ల రైతుల‌కు ఒరిగింది ఏమీ లేద‌ని వాపోయారు. విలువైన భూములు క‌నిపించ‌కుండా పోయాయ‌ని, ప్ర‌భుత్వం జ‌వాబుదారీ త‌నం వ‌దిలి వేసింద‌ని ఆరోపించారు ఆర్ఎస్పీ.

సీఎం కేసీఆర్ చేసిన మోసానికి లెక్క లేకుండా పోయింద‌న్నారు. ధ‌ర‌ణి వ‌ల్ల ప‌న్నీరు రాలేద‌ని కేవ‌లం రైతుల‌కు క‌న్నీళ్లు మాత్ర‌మే మిగిలాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఎస్పీ చీఫ్‌. ఆ క‌న్నీళ్లు ఏకంగా చెరువులుగా మారాయ‌ని, వాటిని చూసి బీఆర్ఎస్ సంబురాలు చేసుకుంటున్నారంటూ మండిప‌డ్డారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఎవ‌రిని ఉద్ద‌రించాల‌ని ధ‌ర‌ణిని తీసుకు వ‌చ్చారంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం బ‌డా బాబుల‌కు, వ్యాపారుల‌కు ల‌బ్ది చేకూర్చేందుకు మాత్ర‌మే ఉప‌యోగ ప‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆర్ఎస్పీ. ఆధిప‌త్య భూస్వామ్య వ‌ర్గాల‌కు మాత్ర‌మే మేలు చేకూరింద‌ని కానీ పేద‌ల‌కు మాత్రం శాపంగా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కేసీఆర్ ఉద్దేశ పూర్వ‌కంగానే రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేశాడ‌ని ఫైర్ అయ్యారు. ధ‌ర‌ణి ప్రైవేట్ వ్య‌క్తుల్లో ఉంద‌న్నారు. రెవ‌న్యూ వ్య‌వ‌స్థ‌లో లోపాల వ‌ల్ల రాష్ట్రంలో 15 ల‌క్ష‌ల ఎక‌రాల భూమికి ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇంత వ‌ర‌కు రాలేద‌ని వాపోయారు. 10 ల‌క్ష‌ల మందికి రైతు బంధు రావ‌డం లేద‌న్నారు.

Also Read : Indira Gandhi Parade : ‘ఇందిర’ ప‌రేడ్ పై కాంగ్రెస్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!