Indira Gandhi Parade : ‘ఇందిర’ ప‌రేడ్ పై కాంగ్రెస్ ఫైర్

ఖండించిన సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్

Indira Gandhi Parade : కెన‌డా లోని బ్రాంప్ట‌న్ న‌గ‌రంలో కొంద‌రు భారీ ఎత్తున ఇందిరా గాంధీని(Indira Gandhi) హ‌త్యకు సంబంధించి ప‌రేడ్ చేప‌ట్టారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనిని తీవ్రంగా ఖండించింది. ఇది అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. ఈ మేర‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు జైరాం ర‌మేష్‌, కేంద్ర మాజీ మంత్రి ముర‌ళీ దేవ‌రా తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఎందుకు స్పందించడం లేదంటూ మండిప‌డ్డారు. దీనిపై స్పందించారు. తాము ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు ఇందిరా గాంధీ. ఆమె శ‌క్తివంత‌మైన మ‌హిళగా పేరు పొందారు. కాగా ఆమె ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే త‌న అంగ‌ర‌క్ష‌కులుగా ఉన్న వారే కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఇందిరా గాంధీ త‌న నివాసంలోనే కుప్ప కూలారు. ప్రాణాల‌ను కోల్పోయారు.

అనంత‌రం ఆమె స్థానంలో అనుకోకుండా పీఎంగా కొలువు తీరారు త‌న‌యుడు దివంగ‌త రాజీవ్ గాంధీ. ఆయ‌న కూడా త‌న త‌ల్లి లాగే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. దీనికి ప్లాన్ చేసింది నిషిద్ధ ఎల్టీటీఈ. ఇటీవ‌ల ఈ కేసులో శిక్ష‌కు గురైన వారికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది కోర్టు. కాగా కొంద‌రు కావాల‌ని ఇందిరా గాంధీని చంపుతూ ఉన్న‌ట్టు ప‌రేడ్ చేప‌ట్ట‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపింది.

Also Read : TDP Mission Rayalaseema : మిష‌న్ రాయ‌ల‌సీమపై ఫోక‌స్

 

Leave A Reply

Your Email Id will not be published!